Saturday, January 17, 2026
E-PAPER
Homeజాతీయంప‌ట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు

ప‌ట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. తొలి ట్రైన్ హౌరా నుంచి గౌహతికి ప్రారంభమైంది. త్వరలో పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇక వందే భారత్ స్లీపర్ రైల్లో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు.

త్వరలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైలు ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -