Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యాలయాల్లో ఎప్పుడూ వందేమాతరం పాడలేదు : ఖర్గే

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యాలయాల్లో ఎప్పుడూ వందేమాతరం పాడలేదు : ఖర్గే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయులకి స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ గేయ స్మారకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని గొప్పగా చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ పాట ప్రసిద్ధ నినాదం. అయినప్పటికీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ కార్యాలయాల్లోగానీ, శాఖల్లోగానీ పాడలేదు. సొంత గ్రంథాల్లోగానీ, సాహిత్యంలోనూ ఈ పాటను పొందుపరచలేదు అలాంటిది ఇప్పుడు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ గేయ 150 స్మారకోత్సవాలు జరుపుతున్నాయని ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ గీతం కంటే ‘నమస్తే సదా వతసలే పాడటానికే ఇష్టపడిందని ఆయన తన ప్రకటనలో ఎత్తిచూపారు.


కాంగ్రెస్‌ పార్టీ 1986 నుండి నేటి వరకు ప్రతి సమావేశం, ప్లీనరీ అయినా, బ్లాక్‌స్థాయి సమావేశం అయినా నేతలు వందేమాతరం పాటను ఆలపిస్తారు. నేడు జాతీయవాద సంరక్షకులమని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు తమ శాఖల్లోగానీ లేదా కార్యాలయాల్లో గానీ వందేమాతరం లేదా మన జాతీయ గీతం జనగణమనను ఎప్పుడూ పాడకపోవడం విడ్డూరం. వాటికి బదులుగా వారు దేశాన్ని కాదు.. వారి సంస్థల్ని కీర్తిస్తూ నమస్తే సదా వత్సల అనే పాటను పాడుతున్నారు. 1925లో స్థాపించినప్పటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ సార్వత్రిక గౌరవం ఉన్నప్పటికీ వందేమాతరాన్ని నిరాకరించింది. ఈ పాటను ఆర్‌ఎస్‌ఎస్‌ స్వీకరించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రంథాలలో లేదా సాహిత్యంలో ఒక్కసారి కూడా పాట ప్రస్తావన కనిపించదు అని ఖర్గే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.


ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో జరిగిన ఈ గేయ 150వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మారక స్టాంపును ఆయన విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా బీహార్‌లోని పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆయన దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనిపై ఖర్గే విమర్శించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భారతీయులకు కాకుండా బ్రిటీష్‌ వారికి మద్దతు ఇచ్చింది. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది. 52 సంవత్సరాలు జాతీయ జెండాను ఎగురవేయలేదు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టిందనే విషయం అందరికీ తెలుసు. సర్దార్‌ పటేల్‌ మాట్లో చెప్పాలంటే.. గాంధీజీ హంతకులు అని ఖర్గే తన ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


కాంగ్రెస్‌ పార్టీ వందేమాతరం, జనగణమణ రెండు గేయాలను ఎంతో గర్విస్తుంది. ప్రతి కాంగ్రెస్‌ సమావేశంలో, కార్యక్రమంలో ఈ రెండు పాటలను కార్యకర్తలు, నేతలందరూ ఎంతో భక్తితో పాడతారు. ఇది భారతదేశ ఐక్యతను, గర్వాన్ని సూచిస్తుంది. వందేమాతర గర్వాన్ని మోసేది కాంగ్రెస్‌నే. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రహమతుల్లా సయాని నాయకత్వంలో గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మొదటిసారిగా వందేమాతరం పాటను బహిరంగంగా పాడారు. ఆ క్షణం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ప్రాణం పోసింది. మత, కుల, ప్రాంతీయ గుర్తుంపును తారుమారు చేస్తూ బ్రిటీష్‌ సామ్రాజ్యం విభవిజించి పాలించే విధానం, భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రూపొందించబడిందని కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. దీనికి వ్యతిరేకంగా వందేమాతరం గీతం అచంచలమైన శక్తి గీతంగా మారింది. భారతమాతపట్ల భక్తితో భారతీయులందరినీ ఏకం చేసింది అని ఖర్గే గుర్తుచేశారు. 1905 బెంగాల్‌ విభజన నుండి మన విప్లవకారుల తుది శ్వాస వరకు వందేమాతరం దేశమంతటా ప్రతిధ్వనించింది. ఇది లాలా లజపతి రారు ప్రచురణ శీర్షిక అని, భికాజీ కామా తయారు చేసిన జెండాపై చెక్కబడిందని ఖర్గే పేర్కొన్నారు. ఈ పాట ప్రజాదరణకు బ్రిటీష్‌వారు భయపడ్డారు. స్వాతంత్య్ర పోరాటానికి గుండె చప్పుడుగా మారిన ఈ పాటను బ్రిటీష్‌వారు నిషేధించారని ఖర్గే అన్నారు.


1938లో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇలా రాశారు. 30 సంవత్సరాలకు పైగా ఈ పాట భారత జాతీయవాదంపై ప్రభావం చూపింది. ఈ పాట భారత జాతీయవాదానికి సంబంధించింది. అలాంటి ప్రజల పాటలు ప్రత్యేకంగా రూపొందించబడలేదు. వాటిని ప్రజల మనస్సులపై రుద్దలేదు. వారు దీన్ని స్వయంగా ఉన్నత శిఖరాలకు చేర్చారు. మనస్సుకి హత్తుకున్నారు. 1937లో ఉత్తరప్రదేశ్‌్‌ శాసనసభ పురుషోత్తం స్పీకర్‌గా అధ్యక్షత వహించినప్పుడు వందేమాతరంను పాడటం ప్రారంభించారు అని ఆయన రాశారు. వందేమాతర గీతాన్ని నవలా రచయిత బకించంద్ర ఛటర్జీ తన నవల ఆనంద్‌మఠ్‌లో భాగంగా నవంబర్‌ 7న 1875లో రాశారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ భారత జాతీయ గీతంగా స్వీకరించింది. కాంగ్రెస్‌ 1937లో జాతీయ గీతంగా స్వీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -