వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్‌లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయి బాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈనెల 14 నుంచి ఈ సిరీస్ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా చిరంజీవి ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్ చేసిచ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ,’డైరెక్టర్ ప్రశాంత్ ఈ సిరీస్‌ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఆనందంతో మాటలు రాలేదు’ అని అన్నారు. ‘మెగాస్టార్ మా ట్రైలర్‌ని లాంచ్ చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ చెప్పారు.
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కష్ణ మాట్లాడుతూ,’ ఈనెల 14న ఈ సీరియస్ ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. ఇది ఈటీవీ విన్‌లో వచ్చే మొట్టమొదటి క్రైమ్ థ్రిల్లర్. మళ్లీ మళ్లీ చూస్తారు అనడానికి నిర్వచనంలా ఉంటుంది’ అని తెలిపారు. ‘జూన్‌లో ‘అనగనగా’ సక్సెస్‌లో కలిశాం. జూలైలో ‘ఎయిర్’ సక్సెస్, ఆగస్టులో ‘కానిస్టేబుల్ కనకం’ సక్సెస్‌తో కలవబోతున్నాం. ‘అమ్మోరు, అరుంధతి’ సినిమాల్ని చూసినప్పుడు ప్రేక్షకులకు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్ కలిగిందో ఈ సినిమా కూడా అలాంటి గొప్ప ఫీలింగ్ ఇస్తుంది’ అని ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చెప్పారు.
మహిళల గౌరవాన్ని పెంచేలా ఉంటుంది
- Advertisement -
- Advertisement -