నవతెలంగాణ – కౌలాలంపూర్ : గాజాపై దురాగతాలను మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్ ఆదివారం ఖండించారు. అవి పాలస్తీనా ప్రజల దుస్థితి పట్ల ఉదాసీనత, ద్వంద్వ ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టం పవిత్రత క్షీణించడం యొక్క ప్రత్యక్ష ఫలితమని అన్నారు. సోమవారం కౌలాలంపూర్‌లో జరగనున్న ప్రాంతీయ ఏసియన్ శిఖరాగ్ర సదస్సుకి ముందు ఆయన మాట్లాడారు. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఈ నెలలో ఇజ్రాయిల్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిన తరుణంలో ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. పాలస్తీనా ప్రజలపై జరిగిన దారుణాలు ఉదాసీనత, ద్వంద్వ ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఈ దురాగతాలపై ఆసియన్ దేశాలు మౌనంగా ఉండకూడదని స్పష్టం చేశారు.
ఫిబ్రవరిలో 10మంది సభ్యుల సంఘంలోని విదేశాంగ మంత్రులు పాలస్తీనా ప్రజల హక్కులకు తమ దీర్ఘకాలిక మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కౌలాలంపూర్ గాజాలోని పాలస్తీనియన్లకు 10 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు మరియు మానవతా సాయాన్ని అందించింది.
గాజాపై దురాగతాలను ఖండించిన మలేషియా విదేశాంగ మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES