నవతెలంగాణ-మునుగోడు: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గ్రామ వీఆర్వోలుగా నియామకాలను చేపట్టడంతో మండలంలోని కొంపెల్లి, కల్వకుంట్ల గ్రామ వీఆర్వోగా లోయపల్లి సైదులు నియమాకమైయారు. దీంతో సోమవారం కొంపెల్లి గ్రామానికి చెందిన వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సభ్యులు వెదిరే విజేందర్ రెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సైదులు ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గ్రామంలోని ప్రజలు రెవెన్యూ సమస్యలు ఉంటే గ్రామ విఆర్వో సైదులును సంప్రదించి సమస్య పరిష్కారం కోసం వీఆర్వో సేవలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వామి, హౌసింగ్ ఏఈ అనిల్, గ్రామ ప్రజలు బత్తుల శ్రీనివాసు తదితరులు ఉన్నారు.