- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా చురా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో రాజింద్ కుమార్ (డ్రైవర్), పుమ్మీ కుమార్, సచిన్ అక్కడికక్కడే మృతి చెందారు. అమర్ సింగ్, దమర్ సింగ్ అనే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని టిస్సా సివిల్ ఆస్పత్రికి, అనంతరం చంబా మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -



