నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో దేవరపల్లి మండల పరిధిలోని ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కష్ణంపాలెం జాతీయ రహదారిలోని వంతెనపై లారీ, కంటైనర్, టాటా మ్యాజిక్ వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ముందు ఉన్న కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో టాటా మ్యజిక్ డ్రైవర్ నాని (29) తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నాని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా దేవరపల్లి పోలీసులు వెల్లడించారు.
ఒకదానికి ఒకటి వరుసగా ఢీకొన్న వాహనాలు..ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES