నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులాలో ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ తెరలేపారు.సుభీక్ష పాలన సాగుతున్న దేశంలో ఆర్థికంగా దివాళ తీసేందుకు ఆ దేశంపై దురాక్రమణ చేసి అధ్యక్షుడు నికోలస్ మదరో, ఆయన భార్యను నిర్భంధించి న్యూయార్క్ తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ దేశ చమురు నిక్షేపాలపై ఆధిపత్యం చెలాయించడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఆయిల్ అమ్మకాలను తమ నియంత్రణలో జరుగుతాయని బీరాలు పలికారు. అయితే ప్రయత్నాలు సజావుగా సాగడానికి వెనిజులా.. చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థంలేని షరత్ విధించారు.
ప్రస్తుతం వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆ ప్రభుత్వానికి ట్రంప్ ఆల్టిమేటం జారీచేశారు. “మెట్టమెుదటగా వెనిజువెలా.. చైనా, రష్యా, ఇరాన్,క్యూబాలతో ఉన్న వాణిజ్య సంబంధాలన్ని తెంచుకోవాలి. అమెరికాను తన ఆయిల్ ప్రొడక్షన్‌లో భాగస్వామిగా అంగీకరించాలి. అధిక మెత్తంలో చమురు అమెరికాకు అమ్మేప్పుడు సానుకూలంగా వ్యవహరించాలి” అని తెలిపారు.అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాకు విక్రయిస్తున్న 30మిలియన్ల బ్యారెళ్ల చమురును 50 మిలియన్ బ్యారెళ్లకు పెంచి మార్కెట్ ధరలకు అమెరికాకు విక్రయించాలని తెలిపారు.



