కారకస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ఆంక్షల పట్ల వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అమలు చేస్తున్న విధానాల వల్ల వెనిజులాలో తమ కంపెనీ కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని, దీనివల్ల వెనిజులా నుండి తమ కంపెనీ వైదొలగితే అమెరికా ఇంధన భద్రతకు ముప్పు కలుగుతుందని చెవ్‌రాన్ సిఇఓ మైక్ విర్త్ హెచ్చరించారు. ఆ నేపథ్యంలో మదురో స్పందిస్తూ, అమెరికా, వెనిజులాల్లో మితవాద శక్తులు, రంగాలు విధించే ఆంక్షల కారణంగా వాస్తవ నష్టం చెవ్‌రాన్ కంపెనీకి కలుగుతుందని మదురో పేర్కొన్నారు. వెనిజులాలోని ఫాసిస్ట్ మితవాద రంగాలు, అమెరికాలోని తీవ్రవాద రంగాలు ఈ ఆంక్షలను విధించాయని మదురో గుర్తు చేసుకున్నారు. వీటివల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం వుంటుందని, పైగా చెవ్‌రాన్ కంపెనీకి కూడా నష్టం జరుగుతుందన్నారు. ఈ చర్యలన్నీ అర్ధం లేనివని మదురో తీవ్రంగా విమర్శించారు. చమురు దిగ్గజ కంపెనీతో ఒప్పందాన్ని ఉల్లంఘించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్ని స్తోందంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కంపెనీతో తాము కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిస్తామని మదురో పునరుద్ఘాటించారు. చమురు ఉత్పత్తిని పెంచుతామని హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం అర్ధంతరంగా తీసుకుంటున్న చర్యల వల్ల వెనిజులాలోకంపెనీ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని మైక్ విర్త్ ఆందోళన వ్యక్తం చేశారు. మరింత సుస్థిరమైన, శాశ్వతమైన ఇంధన విధానం తీసుకురావాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.
ట్రంప్ ఆంక్షలపై వెనిజులా అధ్యక్షుడు ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES