Sunday, May 4, 2025
Homeసినిమానా కెరీర్‌లోనే చాలా స్పెషల్‌..

నా కెరీర్‌లోనే చాలా స్పెషల్‌..

- Advertisement -

‘ఇది చాలా ఫన్‌ మూవీ. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో చాలా ఎంజారు చేయొచ్చు. లాఫ్‌ రైడ్‌లా ఉంటుంది. ఇది నా ఫస్ట్‌ తెలుగు సినిమా. కచ్చితంగా చాలా మంచి స్టార్ట్‌ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాకి నా కెరీర్‌లోనే చాలా స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది. నాకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇందులో నా క్యారెక్టర్‌ డ్యాన్సర్‌ అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది’ అని కథానాయిక ఇవానా అన్నారు.
శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘చ సింగిల్‌’. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషించారు. కార్తీక్‌ రాజు దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో కళ్యాణ్‌ ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్‌ ఇవానా మీడియాతో ముచ్చటించారు.
డైరెక్టర్‌ కార్తీక్‌ ఒకరోజు కాల్‌ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాను. చాలా నచ్చింది. శ్రీ విష్ణు. వెన్నెల కిషోర్‌, కేతిక ఇలా చాలా అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు. గీత ఆర్ట్స్‌ లాంటి గొప్ప సంస్థ ఉంది. నేను తెలుగులోకి రావడానికి ఇదే యాప్ట్‌ అనిపించి ఈ సినిమాని అంగీకరించాను.
ఇందులో హరిణి అనే పాత్రలో కనిపిస్తాను. నాది చాలా జోవియల్‌ అండ్‌ ప్లజెంట్‌ క్యారెక్టర్‌. హరిణి డ్యాన్సర్‌. తన క్యారెక్టర్‌లో చాలా ఎమోషన్‌ ఉంటుంది. ఫ్యామిలీ అటాచ్‌మెంట్‌ ఉంటుంది. తాను ఎవరినైనా ఇష్టపడితే వాళ్లకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఈ క్యారెక్టర్‌ని ప్లే చేయడాన్ని చాలా ఎంజారు చేశాను. అలాగే ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను.
ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ విన్న వెంటనే నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఆ ఎగ్జైట్‌మెంట్‌ ఆడియన్స్‌లో కూడా ఉంటుందని నా నమ్మకం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -