- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీ.జీ, ఇంటిగ్రేటెడ్ (5 సం) కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు గురువారం నుండి ప్రారంభమైనాయి. యూనివర్సిటీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన అధికారులకు తగిన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
- Advertisement -



