- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేసేందుకు మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఈ పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీపడుతున్నారు. పార్లమెంటు నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 వరకు జరగనుంది. ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు.
- Advertisement -