Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉప రాష్ట్రపతి రాజీనామా..దీనికి అసలు కారణం వేరే ఉంది : రాహుల్ గాంధీ

ఉప రాష్ట్రపతి రాజీనామా..దీనికి అసలు కారణం వేరే ఉంది : రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో INDIA కూటమి సభ్యులు INDIA కూటమి ఉపరాష్ట్రపతి నామినీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “ఉప రాష్ట్రపతి రాజీనామా చేసిన రోజు వేణుగోపాల్ నాకు ఫోన్ చేసి ఉప రాష్ట్రపతి రాజీనామా వెళ్లిపోయారని అన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారనే దాని గురించి ఒక పెద్ద కథ ఉంది. మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, కానీ దాని వెనుక ఒక కథ ఉంది. రాజీనామా చేసిన ఆయన ఎందుకు దాక్కున్నారనే దాని గురించి ఒక కథ ఉంది. భారత ఉప రాష్ట్రపతి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? అకస్మాత్తుగా, రాజ్యసభలో విరుచుకుపడే వ్యక్తి పూర్తిగా మౌనంగా మారిపోయాడు. దీనికి అసలు కారణం వేరే ఉంది.” అంటూ రాహుల్ గాంధీ బీజేపీపై కీలక అనుమానాలు వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad