Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నవోదయలో ఏం జరుగుతోంది..?

నవోదయలో ఏం జరుగుతోంది..?

- Advertisement -

ఆరోపణలు ఎదుర్కొన్న వైస్ ప్రిన్సిపాల్ కి మళ్ళీ ఇన్చార్జి బాధ్యతలు 
నవతెలంగాణ-నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో గత అకాడమీకి ఇయర్  పలువురు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు నలుగురు ఉపాధ్యాయులపై ప్రోక్సో కింద కేసు నమోదు రిమాండ్కు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్  గా ఉన్న  మను యోహాన్ ఘటనకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఆయనపై సైతం కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు. కాగా తాజాగా 20 25 విద్యా సంవత్సరం ప్రారంభం  కాగా మళ్లీ ఆయనకే ఇంచార్జి ప్రిన్సిపల్ గా బాధ్యతలు ఇవ్వడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ అదే స్థానంలో బాధ్యతలు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. అయితే బుధవారం ముగ్గురు అధికారులతో కూడిన బృందం విచారణకు వచ్చినట్టు సమాచారం. ఏదో విషయంలో ఇంటర్నల్ గా ఎంక్వయిరీ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఆరా తీసెందుకు  విలేకరులు వెళ్లగా వారిని రానీయకుండా అడ్డుకొని గేటుకు తాళం వేశారు. లోపలికి అనుమతి లేదంటు అడ్డుకోవడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు నవోదయలో ఏం జరుగుతుంది అన్న చర్చ మొదలైంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad