నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ సిగరెట్ తాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజిఐఎంఎస్)లో ఆయనను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లినప్పుడు అక్కడ సిగరెట్ తాగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నీతీశ్ కుమార్‌కు ప్రియమైన నేత అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బిహార్‌లో సుపరిపాలనను తీసుకువస్తున్నాడని ఎద్దేవా చేశారు.
కాగా గతేడాది ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్టయ్యాడు. అదే సమయంలో బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో మొకామా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయనపై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి.



