Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఘనంగా వియత్నాం స్వర్ణోత్సవ వేడుకలు

ఘనంగా వియత్నాం స్వర్ణోత్సవ వేడుకలు

నవతెలంగాణ హనోయి : వియత్నాం 50వ వార్షికోత్సవ వేడుకలు హోచిమిన్‌ నగరంలో ఘనంగా జరిగాయి. 1975వ సంవత్సరలో ఏప్రిల్‌ 30వ తేదీన గెరిల్లాలు అమెరికా సైన్యాన్ని తరిమికొట్టారు. అప్పటివరకు ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా విడిపోయి ఉన్న ఆ దేశం ఒక్కదేశంగా మారింది. అదేరోజు రాజధాని సైగాన్‌కు కమ్యూనిస్టు నేత హోచిమన్‌ గౌరవార్థం ఆయన పేరు పెట్టారు. ప్రస్తుతం నేడు (బుధవారం) హోచిమన్‌ నగరంలో 50వ వార్షికోత్సవ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మిలటరీ కవాతు జరిగింది.


ఈ కవాతులో వేలాది మంది వియత్నాం ప్రజలు ఎర్రజెండాలు ఊపుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దేశభక్తిగీతాలు పాడారు. గగనతలంలో యుద్ధవిమానాలు ఎర్రజెండాలతో ఎగిరాయి. కవాతు ముందు భాగంలో కమలం పువ్వు ఆకారంలో హోచిమిన్‌ చిత్రపటాన్ని ఉంచారు. మొదటిసారిగా చైనా, లావోస్‌, కంబోడియా నుండి 300 మందికిపైగా సైనికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. యువతీ యువకులు కమలాలను చేతబట్టి పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ 50వ వార్షికోత్సవ వేడుకలకు వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తోలామ్‌, లావోస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి-అధ్యక్షుడు థాంగ్లౌన్‌ సిసౌలిత్‌, వియత్నాం అధ్యక్షుడు లుయాంగ్‌ కువాంగ్‌, కంబోడియా పీపుల్స్‌ పార్టీ ఛైర్‌పర్సన్‌ హున్‌సేన్‌, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్‌ మిన్‌చిన్‌ హాజరయ్యారు. అలాగే ఈ వేడుకల్లో వియత్నాం మ్యాప్‌ ఉన్న టీషర్టుల్ని యువతీ యువకులు ధరించి సెల్ఫీలు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img