Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి..

మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట, తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మొదలుపెట్టింది. సోమవారం రాత్రి అత్యంత సన్నిహితుల కోసం పూల్ పార్టీ, క్యాండిల్‌లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు.

ఉదయ్‌పూర్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ హోటల్ ఈ వేడుకలకు వేదికైంది. తొలి రోజు వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి పూల్ వాలీబాల్ ఆడుతూ విజయ్, రష్మిక సందడి చేశారు. అనంతరం జపనీస్ థీమ్‌తో ప్రత్యేకంగా అలంకరించిన ప్రదేశంలో క్యాండిల్‌లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను రష్మిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాప్‌కిన్‌లపై కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరోష్’ అని ఎంబ్రాయిడరీ చేయడం విశేషం.

ఫిబ్రవరి 22న ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించింది. అభిమానులు తమకు పెట్టిన ‘విరోష్’ పేరునే తమ పెళ్లికి పెట్టుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ రోజు (ఫిబ్రవరి 24) మెహందీ, రేపు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. 26న జరిగే వివాహానికి కేవలం 50 మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -