Thursday, April 2, 2026
E-PAPER
Homeజాతీయంవిజ‌య్ రెండు స్థానాల నుంచి పోటీ..ఎంపీ క‌నిమొళి కీల‌క వ్యాఖ్య‌లు

విజ‌య్ రెండు స్థానాల నుంచి పోటీ..ఎంపీ క‌నిమొళి కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీవీకే అధినేత విజ‌య్ రెండు అసెంబ్లీ స్థానాల‌నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. పెరంబూర్,తిరుచ్చి నుంచి పోటీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించి, ఇటీవ‌లె నామినేష‌న్ దాఖ‌లు చేశారు. తాజాగా విజయ‌న్ నిర్ణ‌యంపై డీఎంకే ఎంపీ క‌నిమొళి స్పందించారు. రెండు స్థానాల నంచి పోటీ చేయ‌డం ఆయ‌న న‌మ్మ‌కాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌ని, ఆ విష‌యంపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ద‌ల్చుకోలేద‌ని మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. రానున్న ఎన్నిక‌ల్లో మరోసారి స్టాలిన్ నాయ‌క‌త్వంలోని డీఎంకే పార్టీకే ప్ర‌జ‌లు ఓటు వేస్తార‌ని ఆమె దీమా వ్య‌క్తం చేశారు. స్టాలిన్ 2.0పాల‌న‌లో బ‌హుళ మార్పులు సంభ‌వించ‌నున్నాయ‌న్నారు. కాగా, ఏప్రిల్ 23న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే ద‌ఫాలో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. మే 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -