- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళగం పార్టీ.. పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తేవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో దళితుడైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కవిన్ సెల్వగణేషన్ (27) హత్యకు గురైన ఘటనపై టీవీకే పార్టీ స్పందించింది. పార్టీ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పరువు హత్యల్ని అరికట్టేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు సరిపోవని, వాటిని తగ్గించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని వాదించారు.
- Advertisement -