Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిజయవాడ-హైదరాబాద్ హైవే: చిట్యాల టూ చౌటుప్పల్ వ‌ర‌కు భారీ ట్రాఫిక్

విజయవాడ-హైదరాబాద్ హైవే: చిట్యాల టూ చౌటుప్పల్ వ‌ర‌కు భారీ ట్రాఫిక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: విజయవాడ – హైదరాబాద్ నేష‌న‌ల్ హైవేపై భారీ ట్రాఫిక్ ఏర్ప‌డింది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులతో..మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వరస సెలవులు రావడంతో సొంతూర్ల బాట పట్టిన ప్రజలు.. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి నుంచి చిట్యాల వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలను దారి మళ్లించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -