– తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
నవతెలంగాణ -అడ్డ గూడూరు : గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్ర గూడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిత్తలూరి సోమనారాయణ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆదివారం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చిత్తలూరు హనుమంతరావు , ఇటకాల చిరంజీవి, చిత్తలూరు రవీందర్, మందుల సోమయ్య ,శీల రవి,చిత్తలూరి సుధాకర్, కుంభం గోపాల్,ఎస్.కె సయ్యద్ కుటికంటిరమేష్, పసల రవి, పర్రపాటి ఉపేందర్, శీల లింగమాలు, దర్శనాల సతీష్ , మహిళలు , నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



