Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమన్వయంతోనే గ్రామాభివృద్ధి

సమన్వయంతోనే గ్రామాభివృద్ధి

- Advertisement -

అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం : ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, సర్పంచ్, వార్డు సభ్యుల సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని  నసురుల్లాబాద్ మండల అభివృద్ధి అధికారి రవి ఈశ్వర్ గౌడ్  తెలిపారు. మండలంలో  నూతనంగా ఎన్నికైన 19 జీపీల వార్డు సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం మండల రైతువేధికలో కొనసాగి శనివారంతో ముగించారు. ఐదు రోజులపాటు శిక్షణ పొందిన వార్డు సభ్యులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ  సందర్భంగా ఎంపీడీఓ  రవీశ్వర్ గౌడ్  మాట్లాడుతూ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, గ్రామ సభలో పాల్గొనడం, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు.

శిక్షణ ద్వారా వార్డు సభ్యులకు బాధ్యతలు, అధికారులు, పరిపాలనా విధానం, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ పారదర్శక పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలక మైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్క రించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆ ర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వార్డు సభ్యులకు మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా అవగాహన కల్పిస్తు న్నామని చెప్పారు. వార్డు సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చే సుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిధి వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -