- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలోగల పెద్దతూoడ్ల గ్రామంలో ఉన్న పల్లెదవాఖానలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. సోమవారం ఉదయం 11.30 గంటలకు నవ తెలంగాణ సందర్షించగా దవాఖానకు తాళాలు వేసి ఉన్నాయి. సంబంధించిన వైద్యాధికారుల పర్యవేక్షణ లేకనే సిబ్బంది చుట్టం చూపులా వచ్చామా.. పోయామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పల్లె దవాఖానపై పర్యవేక్షణ చేసి సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
- Advertisement -



