నవతెలంగాణ-జుక్కల్ : మండలంలోని కంటాలి గ్రామంలో రాష్ట్ర పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను గ్రామ సర్పంచ్ నాగనాథ్ చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాడి రైతులు , జీవాలు కలిగి ఉన్న రైతులు పశువులను జీవాలను ఉచిత గాలికుంటు వ్యాధి చికిత్స కేంద్రానికి బారులు తీరారు. మండల వైద్యశాఖ వైద్యుడు పండరినాత ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు ఉచిత టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పశు వైద్యుడు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు అంటువ్యాధిల సోకుతుందనిశ, వ్యాధి సోకిన పశువుకు వేరుచేసి కట్టాలని సూచించారు. గాలికుంటు వ్యాధిని సోకకుండా ముందస్తుగా టీకాలు వేస్తే వ్యాధి బారిన పడవని పశువుల ఎటువంటి నష్టం జరగదని పసి వైద్యుడు పండరిన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , జిపి పాలకవర్గం సభ్యులు , గోపాల మిత్రులు , తదితరులు పాల్గొన్నారు.
గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



