Friday, September 26, 2025
E-PAPER
Homeనిజామాబాద్చిత్తడిగా మారిన బోర్గం రోడ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

చిత్తడిగా మారిన బోర్గం రోడ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్
మండలంలోని బోర్గాం గ్రామం గ్రామం ప్రధాన రోడ్డు గుంతల మయమై చిత్తడిగా మారడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైవే రోడ్డుపనులు జరుగుతున్న నేపాధ్యంలో బోర్గం రోడ్డును వారు తమ టిప్పర్లను ఉపయోగించుకోవడంతో గుంతలు ఏర్పడి చిత్తడిగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైవే రోడ్డు పనులు పూర్తయినప్పటికీ, ఈ రోడ్డు మరమ్మత్తులు జరిపించకపోవడంతో తమకు తిప్పలు తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమత్తులకు సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -