Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్వర్టుపై గుంతలను పూడ్చిన గ్రామస్తులు

కల్వర్టుపై గుంతలను పూడ్చిన గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ కథనానికి స్పందించిన మన మద్దూరు వాట్సప్  గ్రూపు
ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా గ్రామస్తులు ముందుకు
నవతెలంగాణ – మద్దూరు

మద్దూరు మండల కేంద్రం నుండి ముస్త్యాల గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న చిన్న వాగు కల్వర్టుపై గుంతలు అనే శీర్షికను నవ తెలంగాణ పత్రికలో ఈనెల 24న ప్రచురించింది. వెంటనే మన మద్దూరు వాట్సాప్ గ్రూప్ సభ్యులు స్పందించి, ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చేందుకు మన మద్దూరు వాట్సాప్ గ్రూప్ ద్వారా దాతల సహకారంతో మంగళవారం చిన్నవాగు కల్వర్టుపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేశారు.

ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్న వాగు కల్వర్టుపై ఏర్పడ్డ  గుంతలకు మరమ్మతులు చేయడం హర్షనీయమని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెచ్చే నవతెలంగాణ పత్రిక,కు మన మద్దూరు వాట్సాప్ గ్రూప్, సభ్యులకు దాతలకు గ్రామస్తులు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం, గ్రామస్తులు కంఠరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఎఫ్ఎం షౌకత్ అలీ, రాచకొండ సాయిలు, మజీద్ కమిటీ అధ్యక్షుడు షకీల్ అహ్మద్, ఉపాధ్యక్షుడు ఎండి సర్వర్ బియబాని, రేషన్ డీలర్లు ఎండి కరీం, నీల బాలకృష్ణ ,  ఎండి మౌలానా ,బూర్గు నరసింహులు, బోయిని మనోహర్, బొప్పే నాగయ్య, ముంతాజ్ అహ్మద్, బోయిని పవన్, నాయిని ప్రభాకర్, ఫయాజుద్దీన్, తూర్పాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -