– యూత్ ఐకాన్ వినయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
– పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం , ఉప విద్యాశాఖ అధికారి శివ ప్రకాశ్ , హీరో భరత్
నవతెలంగాణ-హైదరాబాద్ : వినయ్ కుమార్ సేవలు యువతకు స్ఫూర్తిదాయకం అని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం అన్నారు. శనివారం పట్నంలోని దీప బ్లడ్ బ్యాంక్ నందు డాక్టర్ అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్ డైరెక్టర్ , యూత్ ఐకాన్ వినయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం , ఉప విద్యాశాఖ అధికారి శివ ప్రకాశ్ , హీరో భరత్ పాల్గొని ప్రారంభించారు . అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వినయ్ కుమార్ సేవలు విద్యార్థులకు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు . అయినా జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు . హీరో భరత్ మాట్లాడుతూ వినయ్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంతమంది విద్యార్థుల కోసం దాదాపు ఆరు సంవత్సరాలుగా విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు వినయ్ కుమార్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు .వినయ్ కుమార్ మాటకడుతూ నా జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన 20 మంది కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు . అనంతరం ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు , రక్త దాతలు , బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


