Saturday, November 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఎన్నికల్లో చెలరేగిన హింస..700 మంది దుర్మరణం

ఎన్నికల్లో చెలరేగిన హింస..700 మంది దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టాంజానియా ఎన్నికలు నరమేధానికి దారి తీశాయి. ప్రెసిడెంట్ సామియా సులుహు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజధాని దార్ ఎస్ సలామ్‌లో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే, వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. గత మూడు రోజులుగా కొనసాగుతోన్న ఆందోళనల్లో ఏకంగా 700 మందికి పైగా పౌరులు మరణించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, ప్రెసిడెంట్ సామియా సులుహు ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార సీసీఎం పార్టీపై ఎన్నికల్లో మోసానికి పాల్పడినట్లుగా తేలడంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. అయితే, శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌తో పాటు తుపాకులను ఫైర్ చేయగా 700 ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ప్రస్తుతం టాంజానియాలో కర్ఫ్యూ విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -