- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో.. అప్పుడే మనం ఓడిపోయినట్లు’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే టెస్ట్‌లు, టీ20ల నుండి రిటైర్ అయిన ఈ స్టార్ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగుతారా..? లేక మధ్యలోనే రిటైర్ అవుతారా..? అన్న చర్చ నడుస్తోంది.
- Advertisement -