నవతెలంగాణ-హైదరాబాద్: 2025 IPL : 2025 ఐపీఎల్ శనివారం పున: ప్రారంభం కానుంది. చిన్నస్వామి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ తొలిసారి బరిలో దిగుతుండటంతో అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. దీంతో విరాట్ ను అభినందించేందుకు అభిమానులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టెస్టు జెర్సీ (తెల్లని జెర్సీ) లతో కింగ్ ఘన స్వాగతం ….
సాధారణంగా ఐపీఎల్ అంటే స్టేడియం అంతా రంగురంగుల జెర్సీలతో నిండిపోతుంది. కానీ, చిన్నస్వామిలో శనివారం రాత్రి కాస్త విభిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది. విరాట్ టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో … ఆర్సీబీ అభిమానులంతా టెస్టు జెర్సీ (తెల్లని జెర్సీ) లతో కింగ్ కు ఘనంగా స్వాగతం పలకాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే స్టేడియం బయట కూడా విరాట్ టెస్టు జర్సీలనే అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ సీజన్‌లో నిలకడగా కోహ్లీ ….
ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే 11 మ్యాచ్ లలో 68.13 యావరేజ్ తో 505 పరుగులు చేశారు. దీంతో ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు బాదిన లిస్ట్ లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏ ఇతర బ్యాటర్ కూడా ఐపీఎల్ లో ఇన్నిసార్లు ఈ ఫీట్ సాధించలేదు. ఈ లిస్ట్ లో వార్నర్ (7), కేఎల్ రాహుల్ (6), ధావన్ (5) వరుసగా ఉన్నారు.
పాయింట్స టేబుల్ లో ….
ఈ సీజన్ లో ఆర్సీబీ నిలకడగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. లీగ్ లో మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్కటి నెగ్గినా ప్లేఆఫ్స్ కు ఈజీగా వెళ్లిపోతుంది. 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ , ఈసారి పక్కా ఛాంపియన్ గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్సీబీ తరువాతి మ్యాచ్‌లు … కోల్ కతా నైట్ రైడర్స్- మే 17, సన్ రైజర్స్ హైదరాబాద్ – మే 23, లఖ్ నవూ సూపర్ జెయింట్స్- మే 27.