నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగాయి.
షేక్ హాసినా పదవీ నుంచి దిగపోయిన కానుంచి భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు తీవ్ర దెబ్బతిన్నాయి. ఆ తర్వాత యూనిస్ మధ్యంతర ప్రభుత్వం రాకతో అంతరాన్ని మరింత పెంచింది. తాజాగా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిక్.. ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నాడు. దీంతో త్వరలో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగవుతాయని విశ్లేషకుల అంచనా.



