Thursday, December 25, 2025
E-PAPER
Homeజాతీయంఅసోంలో విశ్వ హిందూ పరిషత్ బీభ‌త్సం

అసోంలో విశ్వ హిందూ పరిషత్ బీభ‌త్సం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అస్సాంలోని నల్బరి జిల్లాలోని ఒక పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ (విహెచ్పీబిడి) కార్యకర్తలు క్రిస్మస్ వేడుకలను ధ్వంసం చేసి, దుకాణాలలో పండుగ వస్తువులను ధ్వంసం చేశారు. విహెచ్పీబిడి కార్యకర్తలు పానిగావ్ గ్రామంలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లోకి ప్రవేశించి క్రిస్మస్ దినోత్సవ ఏర్పాట్లను ధ్వంసం చేశారు. వారు వేడుకల బ్యానర్, పోస్టర్లను తగలబెట్టారు. ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ పాఠశాల ఆవరణలో క్రిస్మస్ జరుపుకోవద్దని పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారని పోలీసు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా నల్బరి పట్టణంలో క్రిస్మస్ వేడుకలకు వ్యతిరేకంగా కొంతమంది నిరసన తెలిపారని చెప్పారు. అనంతరం నల్బరి పట్టణంలోని జైన్ మందిర్ సమీపంలో ఉన్న క్రిస్మస్ వస్తువులు అమ్మే వివిధ దుకాణాలకు వెళ్లి, దుకాణాల ముందు ఉన్న కొన్ని వస్తువులను తగలబెట్టారు. క్రిస్మస్ వస్తువులు అమ్మే అనేక షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలలోకి కూడా ప్రవేశించి వస్తువులను తగలబెట్టారు.

“మాకు ఇక్కడ క్రైస్తవ పండుగలు వద్దు. భారతీయ మూలాలకు చెందిన పండుగలకు సంబంధించిన ఏవైనా వస్తువులను వ్యాపారం చేయండి. కానీ భారతీయ మూలం కాని పండుగతో వ్యాపారం చేయడానికి మేము అంగీకరించము” అని విహెచ్పీబిడి నల్బరి జిల్లా కార్యదర్శి భాస్కర్ డేకా విలేకరులతో అన్నారు. ఇప్పటివరకు ఎవరిపైనా కూడా ఎటువంటి ఫిర్యాదును పోలీసులు నమోదు చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -