వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్..ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్‌ని అందించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పట్టుదలతో కష్టపడే తత్వం కలవాడు. ఆయన విజన్ స్టూడియోస్ స్థాపించి 11 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ను బాలీవుడ్ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తోంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు హైదరాబాద్‌లో సినీ రంగాన్ని మరింతగా అభివద్ధి చేయబోతున్నాం. హైదరా బాద్ ఇన్‌ఛార్జ్ మంత్రిగా నేను ఆ బాధ్యత వహిస్తాను’ అని తెలిపారు. ‘చిన్న బిజినెస్ నుంచి స్టూడియో స్థాపించే దాకా ఒక లక్ష్యంతో పట్టుదలగా పనిచేశాను. ఈ రోజు మా విజన్ స్టూడియోస్ నుంచి పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు ఉపాధి పొందుతున్నారు. చిన్న చిత్రానికి విడుదల టైమ్‌లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మా విజన్ స్టూడియో నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని దాదాపు వంద సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. ప్రతిభా వంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అందిస్తున్నాను. సినీ రంగంతో పాటు విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో మా అవార్డ్స్ ప్రతి సంవత్సరం అందిస్తాం అన్నారు’ అని విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ చెప్పారు.