– బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని మునిగలవీడు గ్రామ మాజీ సర్పంచ్ పట్నం శెట్టి నాగరాజు తండ్రి అయిన కొలగాని రాజయ్య మృతి చెందగా ఆయన పార్దవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులు ఓదార్చి మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాసి రిటైర్డ్ ఉద్యోగి అయినా కొలగని రాజయ్య మృతి చెందడం గ్రామానికి తీరనిలోటు అని అన్నారు. ఆయన గ్రామానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, మదనతూర్తి మాజీ సర్పంచ్ వలబోజు వెంకటేశ్వర్లు నైనాల గ్రామ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య , మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇసంపెల్లి వెంకటేష్, బైస పెద్ద లింగం, బండ ఉపేందర్, ఇసంపెల్లి ఉపేందర్, బొల్లికొండ నాగరాజు,నీరుడు బిక్షం రెడ్డి, కొలిపాక వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



