నవతెలంగాణ – మల్హర్ రావు(మహాముత్తారం)
మహా ముత్తారం మండలం నుండి త్రివేణి సంగమం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర సరస్వతి పురస్కారాల యాత్రకు గురువారం మహాముత్తారం మండల ప్రజలు బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహార శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి గ్రామ పంచాయతీ నుండి పుష్కర స్థాన దర్శనంకు సంబంధించి బస్సు,తాగునీటి సౌకర్యం కల్పించడంతో మండల ప్రజలందరూ పుష్కర స్నానము ఆచరించి, దర్శనం చేసుకొని తదనంతరం ఉచిత భోజనం చేసిమట్లుగా తెలిపారు. సందర్శకులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన మంత్రికి, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి,మాజీ జెడ్పిటిసి లింగ మళ్ల శారద, దుర్గయ్య, కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్థాన డైరెక్టర్, ముక్కెర,రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, మాజి కో ఆప్షన్ నెంబర్ నజీర్ ఖాన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అట్టెం రమేష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు గడ్డం రాజబాబు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో పుష్కర యాత్రకు వెళ్లిన సందర్శకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES