- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండలంలోని బషీరాబాద్‌లో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి సర్పంచ్ బైకాన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, పలువురు వార్డు సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జమున మహేష్ మాట్లాడుతూ.. స్వామి వివేకానందుడి బోధనలు మనందరికీ ఆచరణీయంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్, రాజు, శేఖర్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, నాయకులు ఏనుగు గంగారెడ్డి, నర్రా మోహన్, బైకాన్ ముఖేష్, శ్రీనివాస్, తిరుపతి, మురళీ, కృష్ణమూర్తి, రమేష్, సలీం, శంకర్, సత్యానంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



