Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఈనెల 21 న వాలీబాల్ పోటీలు 

ఈనెల 21 న వాలీబాల్ పోటీలు 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 

గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు గాను పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21 న ‘ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీల’ ను నిర్వహించడం జరుగుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, డెలిగేట్ మెంబర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బుధవారం ఆయన దుబ్బాకలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో లచ్చపేట మోడల్ స్కూల్లో ఈ నెల 21 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఈ వాలీబాల్ పోటీలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ యూనివర్సిటీ సీఎం సలహాదారు రవికాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు, ఈ పోటీల్లో సుమారు 70 టీములు పాల్గొంటున్నాయని వెల్లడించారు. నియోజకవర్గం లోని ఆసక్తి కలిగిన యువత ఈ క్రీడల్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ చందిరి సంజీవరెడ్డి, జిల్లా నాయకులు అందె రాజిరెడ్డి, టీ. నరసింహారెడ్డి, బిజ్జ గిరిబాబు, ఐలయ్య, రాజేందర్, బాల్ రెడ్డి, హనుమంత రెడ్డి పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -