Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ రహిత సమాజం కోసం వాలంటీర్లు కృషి చేయాలి 

డ్రగ్స్ రహిత సమాజం కోసం వాలంటీర్లు కృషి చేయాలి 

- Advertisement -

ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

నేటి యువత డ్రగ్స్ రహిత సమాజం కొరకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కృషి చేయాలని ఎన్ఎస్ఎస్ మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు రామన్నగూడెం గ్రామంలోని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 4వ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు వాలంటీర్లు యోగా చేశారు.

అనంతరం 8;30 నుండి 10:00 గంటల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించి శుభ్రపరిచారు. 11:00 గంటల నుండి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో గ్రామస్తులు, యువత, వయోవృద్దులు పాల్గొని తమ అనారోగ్య సమస్యలను మిడ్ లెవెల్ హెల్త్ ప్రమోటర్ వినీత్ కు తెలియజేసి, టాబ్లెట్స్, సిరప్స్, ఆయింట్మెంట్లను తీసుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని తెలిపారు. కావున అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్ ఎస్ ఎస ప్రత్యేక శిబిరంలో యువతలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడంతోపాటు, చదువు, ఉద్యోగం, కుటుంబం, సమాజంలో ప్రతిష్ట కోల్పోతారని అన్నారు. మత్తు పదార్థాలు చట్టవిరుద్ధం, వాటి వాడకం జైలు శిక్షలకు దారితీస్తుందని తెలిపారు. నేటి యువత డ్రగ్స్ రహిత సమాజం కొరకు కృషి చేయాలని, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగి ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు.

డ్రగ్స్ వాడకం వల్ల యువత చెడు వ్యసనాలకు గురవుతున్నారని, వాటిని నిర్మూలించడానికి వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. సమాజాభివృద్ధి యువత పైన ఆధారపడి ఉందని కావున యువత చెడువ్యసనాలకు లోను కాకుండా, సద్గుణాలను కలిగి ఉండాలని అన్నారు.  వాలంటీర్లు “డ్రగ్స్‌కు దూరంగా – సమాజ సేవలో ముందుండాలి” అనే ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సలీం, కార్తీక్, ఇమ్మానియేల్, శ్రీకాంత్, జేమ్స్, అశ్విక్, మహేష్, దేవేందర్, సంగీత, మీనాక్షి, దివ్య, శశి, చంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

రేపు రక్తదాన శిబిరం 

ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామన్నగూడెం ప్రత్యేక శిబిరంలో  గ్రామస్తుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గాయపడిన సమయంలో, ఆపదలో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, కావున గ్రామంలోని యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ గారు హాజరవుతారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -