నవతెలంగాణ – హైదరాబాద్: పూణె మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉండడంతో అధికారం కోసం పోటీ పడుతున్న కౌన్సిలర్లు ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు ఇస్తున్నారు. లోహ్‌గావ్-ధనోరి వార్డులో ఓ అభ్యర్థి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రా ద్వారా 11 మంది ఓటర్లకు ఒక్కొక్కరికి 1,100 చదరపు అడుగుల భూమిని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది. ఇక విమన్ నగర్‌లో అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి ఓటర్లకు విదేశీ ట్రిప్పును ప్రకటించారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే ఐదు రోజులపాటూ థాయ్‌లాండ్‌కు లగ్జరీ టూర్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక మరికొన్ని చోట్ల లక్కీ డ్రా ద్వారా ఖరీదైన ఎస్‌యూవీ కార్లు, ద్విచక్ర వాహనాలు, మహిళా ఓటర్లకు పైథానీ, పట్టు చీరలు, బంగారు, వెండి ఆభరణాలు వంటి హామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ఇప్పటికే బహుమతులను కూడా అందించినట్టు తెలుస్తోంది. కొందరు కుట్టు మెషీన్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఇక క్రీడా ఔత్సాహిక ఓటర్ల కోసం రూ.లక్ష నగదు బహుమతితో క్రికెట్ లీగ్‌లు ఏర్పాటు చేశారు.
మాకు ఓటేస్తే.. థాయ్‌లాండ్ ట్రిప్, బంగారం, ఎస్‌యూవీ కార్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



