నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర బీహార్‌లో ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ ఆరో రోజు జంబల్ పూర్ కు చేరుకుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఇండియా బ్లాక్ పార్టీలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా CPI(ML) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఈసీ ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతోంది, సమగ్ర ఓటర్ జాబితా సవరణలో దొంగ ఓట్ల నమోదు చేశారని మండిపడ్డారు. ఫేక్ ఓట్లపై అనేక ఆధారాలు చూపించినా..ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదని విమర్శిచారు.
‘SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో ఓటర్ల సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పటికే దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించారు. డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత ఇంకా అనేక మంది ఓట్ల తొలగించబడుతాయి. ఈ యాత్ర ద్వారా ఈసీ ఓట్ల చోరీ విధానాన్ని ప్రజల వద్ద ఎండకడుతాం’ అని అన్నారు. 20 జిల్లాల్లో 1,300 కి.మీ.లకు పైగా సాగే ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది.