నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్ కి సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్ట్ జాబితాలు తప్పుల తడకను సరిచేయాలని వినతి పత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత మాట్లాడుతూ.. 10 వార్డు ,11 వార్డులో ఉన్న ఓటర్ లిస్ట్ లలో ముఖ్యంగా అర్సపల్లి, ఆటోనగర్, గాజులపేట, గాంధీ చౌక్, ఇంద్రాపూర్, ఆర్ఆర్ చౌరస్తా, మాలపళ్లి ఇలా ఒక దానికి ఒకటి సంబంధం లేని ఓట్లు 10, 11 వార్డ్ లో జంపింగ్ అయ్యాయి. అలాగే ఈ రెండు వార్లలో దాదాపు 1000 ఓట్లకు పైగా నిజామాబాద్ అని పెట్టి ఇంటి నంబర్ మాత్రమే ఉన్నది ఎలాంటి వార్డు పేరు లేకుండా ఉన్న ఓట్లు ఎక్కువగా ఉన్నాయి మరికొన్ని ఓట్లల్లో ఎన్ జెెడ్బి , ఎన్్జెడ్బి, ఎన్ జెడ్ బి అని నిజామాబాద్ తప్ప ఇంకో అడ్రస్ లేకుండా ఇలా మరొక వెయ్యి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓటర్ లిస్ట్ లో ఉన్న అవకతవకలని సరిచేసి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఆ లిస్టులు మళ్ళీ ఒకసారి అందరికీ ఇచ్చి చూసిన తర్వాత అందరూ సరిగ్గా ఉన్నాయి అన్న అభిప్రాయం చెప్పిన తర్వాతనే ఓటర్ లిస్ట్ ఫైనల్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎ అనిత, డి దీపిక, పార్టీ సభ్యులు శ్రీదేవి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ లిస్ట్ జాబితాలు తప్పుల తడకను సరిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



