Wednesday, March 25, 2026
E-PAPER
Homeజిల్లాలుఓటర్ లిస్టు తప్పులు లేకుండా తయారు చేయాలి

ఓటర్ లిస్టు తప్పులు లేకుండా తయారు చేయాలి

- Advertisement -

ఓటర్ లిస్టు తప్పులు లేకుండా తయారు చేయాలి
నవతెలంగాణ -పెద్దవూర
ఓటర్ లిస్టు సవరణ పై ప్రత్యేక శ్రద్ద వహించి 100 శాతం కచ్చి తత్త్వం తో తప్పులు లేకుండా తయారు చేయాలని మండల తహసీల్దార్ శ్రీదేవి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్వోల నిర్వహించిన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు మనదేశంలో ఎనిమిది సార్లు ఎస్ ఐ ఆర్ చేయడం జరిగిందని, చివరగా 2004లో ఎస్ఐఆర్ చేయడం జరిగిందని మళ్లీ ఇప్పుడు మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈఎస్ఐఆర్ లో 2004లో ఉన్న ఓటర్ లిస్టును ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్టు తో అనుసంధానం చేస్తూ మ్యాచింగ్ చేయడం జరుగుతుందని, 2004 తర్వాత జన్మించిన వారికి ఓటర్ లిస్ట్ కు సంబంధించి జనన ధ్రువ పత్రంతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువపత్రం లేదా నివాస స్థానిక ధ్రువ పత్రం సమర్పించాల్సి ఉంని అన్నారు. 1987 నుండి 2004 మధ్యలో పుట్టిన వారికి ఓటర్ జనన ధ్రువ పత్రంతోపాటు తల్లి లేదా తండ్రి యొక్క ధ్రువ పత్రాలు కూడా సమర్పించాల్సి
ఉందని, 1987 కు ముందు జన్మించిన వారికి కేవలం ఓటర్ వివరాలను సరిపోల్చుకొని ఓటర్ లిస్టు అప్డేట్ చేయాల్సి ఉన్నదని తెలిపారు. ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ ఇరుమాది పాపిరెడ్డి, మేదరి దేవేందర్ మాట్లాడుతూ కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి వారిని ఓటర్ లిస్టులో ఫామ్ 6 నింపి నమోదు చేయాలని,
చనిపోయిన వారిని ఫామ్ 7 ఆధారంగా డిలీట్ చేయాలనికోరారు. ఫామ్ 8 ద్వారా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే వార్డు, ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేటట్లు చూడాలని అన్నారు.
1200 దాటిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను రేషన్లైజేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.ప్రతి బిఎల్ఓ ప్రతి ఓటర్ కు సంబంధించి ఎన్యూ మరేషన్ ఫామ్స్ ను నింపి సకాలంలో సూపర్వైజర్లకు, ఏఈఆర్ఓ లకు అందజేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -