Sunday, January 11, 2026
E-PAPER
Homeజిల్లాలుఓటర్ల జాబితా..బీఎల్ఓలు ప్రజలు సహకరించాలి

ఓటర్ల జాబితా..బీఎల్ఓలు ప్రజలు సహకరించాలి

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గోషామహల్ అసెంబ్లీ -65 పరిధిలో ఓటర్ల జాబితాలలో జాబితాల వివరాల కోసం ప్రతి పోలింగ్ బూత్ లో బూత్ లెవెల్ ఆఫీసర్ లు (బి ఎల్ ఓ)అందుబాటులో ఉన్నారని గోషామహల్ జీహెచ్ఎంసీ సర్కిల్ -30డిప్యూటీ కమిషనర్ ఉమాప్రకాష్ అన్నారు. గోషామహాల్ నియోజకవర్గం లోని 235 పోలింగ్ బూత్ లలో 235 మంది బీఎల్ ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హిందీ నగర్ స్పోర్ట్స్ భవన సముదాయంలో వివిధ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మీ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్  లలో బీఎల్ఎలకు బుక్ మై కాల్ అవకాశాన్ని సద్విగలను చేసుకోవాలని కోరారు.  బీ ఎల్ ల కు ఫోన్ ద్వారా ఫోన్ కాల్ బుక్ చేసుకుంటే, ఓటర్ జాబితాలో మీ సమస్యలకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ బీఎల్ ఓల ఫోన్ నెంబర్లు హెల్ప్ లైన్ యాప్లో పొందుపర్చినట్లు తెలిపారు. 48 గంటల్లోపు ఎవరైనా బుక్ మై కాల్ ద్వారా ఫోన్ చేస్తే, సంబంధిత వివరాలను బిఎల్ఎలు వివరిస్తారని ఉమాప్రకాష్ వివరించారు. గోషామహాల్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ లలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రతి రోజు పోలింగ్ బూత్లను పర్యవేక్షించి, ఓటర్ల జాబితాల వివరాలు, ఓటర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిజెపి పార్టీ నాయకులు ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సిపిఐ(ఎం) పార్టీ, టిడిపి పార్టీ నాయకులు, జిహెచ్ఎంసి సిబ్బంది బి ఎల్ ఓ  లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -