నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యల్ప పోలింగ్‌ను నమోదు చేసింది. ఓటింగ్ ప్రక్రియ మొదలై ఐదు గంటలు అవుతున్నప్పకిటీ, ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక, ఉదయం 11 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేవలం 40.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇదే అత్యల్ప శాతం కావడం గమనార్హం. ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుండటంతో.. నియోజకవర్గంలో పోలింగ్ శాతం మరింత తగ్గే అవకాశం ఉంది.
మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ముఖ్యంగా వెంగళ్రావు నగర్, మధురా నగర్ వంటి ప్రాంతాల్లో ఓటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఓటర్లు ఈ ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.



