Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీకి ఓటేస్తే వృథా: శ‌శిథ‌రూర్

బీజేపీకి ఓటేస్తే వృథా: శ‌శిథ‌రూర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేప‌థ్యంలో కొట్టాయం మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి పార్టీ ఓటు వేయ‌డ‌మంటే వృథా అని ఎద్దేవా చేశారు. కేర‌ళలో నిజ‌మైనా పోటీ యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్ మ‌ధ్య ఉంటుంద‌న్నారు.

“నా దృష్టి కేరళ రాష్ట్ర ఎన్నికలపైనే ఉంది. అసోం, బెంగాల్, తమిళనాడులో నా సహచరులు అందరూ ప్రచారం చేస్తున్నారు.. కేరళలో ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అసంబద్ధం కాదు.. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మధ్యే అసలైన పోరు. కాబట్టి బీజేపీకి ఓటేస్తే వృథా’’ అని అన్నారు. మే 9న కేరళ శాసనసభకు ఒకే ద‌శ‌లో మే 9న ఎన్నికలు జరగనున్నాయి. మే4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -