Monday, March 16, 2026
E-PAPER
Homeజాతీయంముమ్మ‌రంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్

ముమ్మ‌రంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్ల‌కు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. కానీ ఇప్ప‌టికే 26 అభ్య‌ర్థుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే కొత్త స‌భ్యుల కోసం కేవ‌లం 11 సీట్ల‌కు మాత్ర‌మే ఇవాళ ఓటింగ్ జ‌రుగుతోంది. బీహార్‌, హ‌ర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ఓటింగ్ కొన‌సాగుతోంది. బీహార్‌లో అయిదుగురు, ఒడిశాలో న‌లుగురు, హ‌ర్యానాలో రెండు సీట్ల కోసం ఎన్నిక జ‌రుగుతోంది. ఏక‌గ్రీవంగా ఎన్నికైన అభ్య‌ర్థుల్లో ఏడుగురు బీజేపీ, అయిదుగురు కాంగ్రెస్, టీఎంసీ న‌లుగురు, డీఎంకే నుంచి ముగ్గురు ఉన్నారు.

శివ‌సే, ఆర్పీఐ, ఎన్సీ, ఎన్సీపీ ఎస్పీ, అన్నాడీఎంకే, యూపీపీఎల్ పార్టీల నుంచి ఒక్కొక్క‌రు నెగ్గారు. రాజ్య‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన ప్ర‌ముఖుల్లో శ‌ర‌ద్ ప‌వార్‌, అభిషేక్ సింఘ్వీ, తిరుచ్చి శివ‌, వినోద్ త‌వ‌డే ఉన్నారు. అయితే బీహార్ నుంచి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కూడా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీప‌డుతున్నారు. త‌మిళ‌నాడు నుంచి ఆరుగురు అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. తిరుచ్చి శివ‌, తందిదురై ఆ జాబితాలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -