Thursday, December 25, 2025
E-PAPER
Homeజిల్లాలువాడి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

వాడి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలం వాడి గ్రామ సర్పంచ్ గోలి రమ్య లింబాద్రి దంపతులు గురువారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా సర్పంచ్ గోలి రమ్య లింబాద్రి తెలిపారు. సర్పంచ్ దంపతులకు ముత్యాల సునీల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -