Sunday, April 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మద్దతు ధర కోసం ఎదురుచూపులు...

మద్దతు ధర కోసం ఎదురుచూపులు…

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మార్కెట్ లోని వ్యాపారాలు  లాభార్ధినే దెయ్యంగా పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేయడం సహజమే అయినా అరుగాలం కష్టపడి కంటికి రెప్పలా చూసుకొని పంటను పండించిన రైతన్నలు దళరుల రాజ్యంలో అడుగడుగునా నిలువునా మోసానికి గురువుతూనే ఉన్నాడు.తీరా పంటలు ధర అమాంతంగా పడిపోవడం తో రైతులు నష్టాల ఉభిలో కురుకుపోతున్నారు.మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు.ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇటీవల గత కొన్ని రోజుల నుంచి అకాల వర్షల వల్ల మొక్క జొన్న పంటలు కోసి కుప్పలు వేయగా తడిసి  చిందర వందరంగా మారాయి. కూలీలు రాక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది ఏమీ లేక  ఇక కూలీలు చెల్లించి  రైతులు అప్పుల ఊబిలో  పడిపోతున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా  రాక రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం రైతులకు ఆదుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు  వివరిస్తుందని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో  ఇక్కడి దళారి వ్యవస్థ  1600 1700 కు  తక్కువ ధరలకు కొనుగోలు చేసి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న రైతులు  మొక్కజొన్న పంటలు సాగు చేశారు. రైతన్నలు దళారుల రాజ్యంలో అడుగడుగున  మోసపోతూనే ఉన్నారు. మొక్కజొన్న ప్రభుత్వ మద్దతు ధర  2,400  ఉండగా ఇక్కడి దళారులు మాత్రం 1700 నుంచి 1800 వరకు  మొక్కజొన్న పంటలను కొనుగోలు చేస్తున్నారు కొంత మంది వ్యాపరులు రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తారు. వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని మండల రైతన్నలు కోరుతున్నారు.

గిట్టుబాటు ధర కల్పించి  ఆదుకోవాలి: గంగామల్లు పార్డి (బి)
కొన్ని రోజుల క్రితం అకాల వర్షాలు, ఈదురు గాలులు  కురిశాయి.చేతి కి వచ్చిన పంటలు ఎక్కడ చేయి జారిపోతుందని భయంతో  గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా  తక్కువ ధరలకే అమ్ముకుంటున్నాం  ఎకరానికి 30 వేల నుంచి 50 వేల వరకు  పంటలకు పెట్టుబడి ఖర్చులు చేశాం ఇదే అలుసుగా తీసుకొని  వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోళ్లు చేసి మోసం చేస్తున్నరు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ కొనుగోలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము.
పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సాయి కుభీర్ 
 ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఆదుకోవాలి. మొక్కజొన్న పంట కోతకు రాకముందే అధిక ధరలు ప్రకటిస్తారు తీరా చేతికి వచ్చిన తర్వాత  అమాంతం ధరలు తగ్గిపోతాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా దళారులు చోచ్చుకుపోయి రైతులను మోసం చేస్తున్నారు. రైతులను గుర్తించి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -