Saturday, May 17, 2025
Homeఅంతర్జాతీయంWAR: ఒక్కరోజులోనే 115 మంది మృతి...

WAR: ఒక్కరోజులోనే 115 మంది మృతి…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమాన్ని సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గత మూడు రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో ఏకంగా 115 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజా శివార్లలోని దేర్‌ అల్‌ బలాహ్‌, ఖాన్‌ యూనిస్‌ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్‌ సేనలు బాంబుల వర్షం కురుస్తూనే ఉన్నారు. ఈ దాడుల్లో 115 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇజ్రాయెల్‌ మినహా గల్ఫ్‌ దేశాలలో జరిపిన పర్యటన ముగిసిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు జరిగాయి. గాజా స్ట్రిప్‌ సరిహద్దులపై ఇజ్రాయెల్‌ దిగ్బంధం మూడు నెలలుగా సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -