- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్‌లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.
- Advertisement -



